Parvathipuram: సీతంపేటలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు!
Parvathipuram: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొని అడవితల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.
Parvathipuram: సీతంపేటలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు!
సీతంపేట: ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని సీతంపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంత ప్రాంతం నుంచి ఐటిడిఎ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అడవితల్లి విగ్రహానికి పూల మాలలు వేసారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నిరంగాల్లో గిరిజనులు రాణించాలని దానికి అనుగుణంగా తమ ప్రతిభ కనబరచాలన్నారు. ఐటిడిఎ, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కూటమి ప్రభుత్వం హయాంలో కల్పించుకున్నామని అన్నారు.
2019-24 మధ్య ఒక్క గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించలేదని అన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గానీ వెనక్కి నెట్టారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ స్వప్నల్ పవార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు తెజోవతి, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పడాల భూదేవి, కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు.




