Parvathipuram: ఆదివాసీ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆగస్టు 8న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్. ప్రభాకర రెడ్డి తెలిపారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 6 Aug 2026 12:23 PM IST
Parvathipuram
X

Parvathipuram: ఆదివాసీ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి!

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు జిల్లా ప్రజలందరూ, గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి

Parvathipuram: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం-2026 సందర్భంగా ఈ నెల 08.08.2026 (శనివారం) ఉదయం 10.00 గంటలకు పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. ప్రభాకరరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమానికి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి, గౌరవనీయులైన గిరిజన సంక్షేమ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు.గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, వారసత్వాన్ని గౌరవిస్తూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ వేడుకల్లో గిరిజన కళా, సాంస్కృతిక ప్రదర్శనలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలునిర్వహించబడతాయని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లాలోని అందరు గిరిజన సోదర సోదరీమణులు, స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు, వన్ ధన్ వికాస్ కేంద్రాల (VDVK) సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు, గిరిజన యువత, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

జిల్లాలోని అన్ని సంబంధిత శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గిరిజనుల భాగస్వామ్యాన్ని విస్తృతంగా నిర్ధారించాలని కలెక్టర్ సూచించారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లాలో చిరస్మరణీయంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఆర్. వైశాలి, ప్రాజెక్ట్ అధికారి, ITDA, పార్వతీపురం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story