Vizianagaram: సీతం కళాశాలలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం.. ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్!

Vizianagaram: ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా విజయనగరం సీతం ఇంజనీరింగ్ కళాశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్ చేపట్టారు. సేకరించిన టన్ను వ్యర్థాలను గ్రీన్‌వేవ్స్ సంస్థకు అప్పగించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 16 Sept 2026 11:14 PM IST
Vizianagaram
X

Vizianagaram: సీతం కళాశాలలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం.. ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్!

విజయనగరం, సెప్టెంబర్ 16, 2026: ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెలియజేసేందుకు సీతం కళాశాలలో ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమం సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు మరియు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి మార్గదర్శకత్వంలో జరిగింది. కళాశాలలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, తమ వద్ద ఉన్న ఉపయోగించని విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ సేకరణలో అందచేశారు.

సేకరించిన ఈ-వేస్ట్‌ను సరైన రీసైక్లింగ్ మరియు పర్యావరణహిత పద్ధతుల్లో నిర్వహించేందుకు "గ్రీన్‌వేవ్స్ ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ "సంస్థకు అధికారికంగా సుమారుగా ఒక టన్ను అప్పగించారు. గ్రీన్‌వేవ్స్ ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ ప్రతినిధి శ్రీమతి బ్రహ్మాణి కళాశాల నుంచి సేకరించిన ఈ-వేస్ట్‌ను స్వీకరించారు.

ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ ఓజోన్ పొరను పరిరక్షించడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఈ-వేస్ట్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు మరియు సిబ్బంది "తగ్గించడం పునర్వినియోగం పునరుత్పత్తి అనే సూత్రాలను పాటిస్తూ, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సురక్షితంగా పారవేయడంపై సమాజంలో అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమాన్ని ఇఇఇ విభాగాధిపతి శ్రీ వై. సంతోష్ సమన్వయం చేశారు. కార్యక్రమంలో సి .ఎస్.ఓ.శ్రీ సత్యనారాయణ, ,అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్.వాలంటీర్లు, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ సుస్థిరత, గ్రీన్ క్యాంపస్ విధానాలు మరియు సామాజిక బాధ్యత పట్ల సీతం కళాశాలకున్న నిబద్ధత మరోసారి ప్రతిబింబించింది. శుభ్రమైన, పచ్చని, సుస్థిర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా బాధ్యత వహించాలి అనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.