Parvathipuram: కలెక్టరేట్‌లో యోగా పోటీలు రాష్ట్ర స్థాయికి విజేతల ఎంపిక
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు 'యోగాంధ్ర' జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Parvathipuram: కలెక్టరేట్‌లో యోగా పోటీలు రాష్ట్ర స్థాయికి విజేతల ఎంపిక
పార్వతీపురం: జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకరరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత ఆదేశాల మేరకు యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలు కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు. సోలో యోగా , ప్రాణాయామం, గ్రూప్ యోగా కేటగిరీలలో ఆదివారం జూనియర్ విభాగం 10 నుండి 18 సం. వారికి ఈ పోటీలు నిర్వహించారు.
ఆయుష్ శాఖ జిల్లా ఇంచార్జి అధికారి డా టి. హేమాక్షి ఆద్వర్యంలో యోగా గురు మోహన్ గంతాయత్ తో కూడిన బృందం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు.
కార్యక్రమంలో డాక్టర్ జగన్ మోహన్ మాట్లాడుతూ ఆదివారం ప్రారంభమైన జిల్లా స్థాయి పోటీలు సోమవారం యంగ్, సీనియర్లు 19 నుండి 35సం మరియు 35 పై బడిన వారికి మంగళవారం జూనియర్, యంగ్ , సీనియర్లు కు కొనసాగుతాయన్నారు. ఇందులో విజేతలను యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. యోగా పై యువతలో ఆసక్తి పెంపొందించడం, శారీరక,మానసిక ఆరోగ్యానికి యోగా ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత అవగాహనకు యోగా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ జిల్లా ఇంచార్జి అధికారి డా టి. హేమాక్షి, సీతానగరం ఎంపిడిఓ ఎం.ఎల్.ఎన్ ప్రసాద్, యోగా గురు లు మోహన్ గంతాయత్, కె. జనార్దనరావు, ఆయుష్ వైద్యాధికారి ఐ.మహేష్,యోగా మాస్టర్స్ ప్రసాదరావు, రామకృష్ణ , ఆయుష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




