Kothavalasa: కొత్తవలసలో వైఎస్సార్‌సీపీ భారీ రాస్తారోకో
Kothavalasa: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస జంక్షన్‌లో వైసీపి భారీ రాస్తారోకో.
Kothavalasa: కొత్తవలసలో వైఎస్సార్‌సీపీ భారీ రాస్తారోకో
కొత్తవలస: పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు కొత్తవలస మండలం నాయకులు , కార్యకర్తలు కలిసి కొత్తవలస కూడలిలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం నుండి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రాస్తారోకో కార్యక్రమ నిర్వహించి. మానిఫెస్టో ను తగలబెట్టడం జరిగినది.
ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో బూటకపు హామీలు ఇచ్చి గెలిచిందని , అలా గెలిచి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి వెంటనే ప్రజలకు న్యాయం చేయాలని, లేదా చేతగాని పక్షంలో ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు గారు, రాష్ట్ర సoయుక్త కార్యదర్శి గొరపల్లి శివగారు, Mpp గోపమ్మ గారు, మండల పార్టీ అధ్యక్షులు ఒబ్బిన నాయుడు గారు, సీనియర్ ,వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




