Vizianagaram: కూటమి ప్రభుత్వం జిత్తులమారి ప్రభుత్వం.. బొత్స సత్తిబాబు ఫైర్

Vizianagaram: గజపతినగరంలో వైయస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బొత్స సత్యనారాయణ.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 23 April 2026 5:13 PM IST
Vizianagaram
X

Vizianagaram: కూటమి ప్రభుత్వం జిత్తులమారి ప్రభుత్వం.. బొత్స సత్తిబాబు ఫైర్

విజయనగరం జిల్లా: గజపతినగరం వైఎస్సార్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం బెల్లాన కన్వర్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ మద్ది శ్రీనివాసరావు, బొబ్బిలి మాజీ శాసనసభ్యులు సంభంగి వెంకట చిన్నప్ప నాయుడుతో పాటు మండల పార్టీ అధ్యక్షులు జడ్పిటిసి హాజరు కాగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.

కూటమి ప్రభుత్వం జిత్తులమారి ప్రభుత్వం. ఉన్నది లేనట్టు.. లేని ది ఉన్నట్లు.. ప్రజలను.. మోసం చేస్తున్న ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వానికి కొంతమంది మీడియా సంస్థలు కొమ్ము కాస్తున్నాయి.. నేడు గ్రామాల్లో ఉపాధి హామీ పూర్తి స్థాయిలో అమలవుతుందా.. గ్రామాల్లో ఎంతమంది ఉన్నా పని కల్పించాలి. రెక్క ఆడితే గాని డొక్కాడదు కానీ నేడు రోజు కొక గ్రూపు కు పనికల్పిస్తుంది కూటమి ప్రభుత్వం.. దొంగమస్తర్లు వేసుకొని.. ఉపాది పని కల్పిస్తున్నారు.. నేడు పొదుపు గ్రూపులో సున్నా వడ్డీ వస్తుందా చెప్పండి. ఈ రోజు ఆరోగ్య శ్రీ అటుకెక్కి పోయింది మెడికల్ కాలేజీ ప్రయివేట్ పరం చేస్తే.. పేద వాడి ఆరోగ్యం ఏమవ్వాలి.. కూటమి పాలన వచ్చి మూడు సంవత్సరాలు అయినా.. విడో ఫెన్షన్ లు జాడేలేదు.. నాడు జగన్మోహన్ రెడ్డి పాలన.. అర్హులైన వారందరికీ.. ఫెన్షన్ లు ఇచ్చారు.. కూటమి పాలన పై పోరాటం చేసే సమయం ఆసన్న మైయ్యింది. గ్రామ ప్రాంతాల్లో.. అమ్మవొడి.. అమలు జరిగే జాడ పూర్తి స్థాయిలో లేదు. అంటూ కూటమి ప్రభుత్వ తీరు పై విరుచుకుపడ్డారు.. ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్తిబాబు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story