Kurupam: పుష్పశ్రీవాణి గృహ నిర్బంధం వైకాపా పోరును అడ్డుకున్న పోలీసులు!
Kurupam: కురుపాంలో వైఎస్సార్‌సీపీ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిని ఇంటి వద్దే అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Kurupam: పుష్పశ్రీవాణి గృహ నిర్బంధం వైకాపా పోరును అడ్డుకున్న పోలీసులు!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా, ఆగస్టు 10: కురుపాం నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నిర్వహించాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.
ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజ్‌లను జియమ్మవలస మండలం చినమేరంగిలోని పుష్పశ్రీవాణి నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు.
ర్యాలీ నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు తెలియజేయడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడే నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కార్యకర్తలు "సీఎం డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేస్తూ, డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల చర్యను ఖండించిన పుష్పశ్రీవాణి, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. డీఎస్సీ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




