Bobbili: బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయనను కలిసిన జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను!
Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయనను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను).
Bobbili: బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయనను కలిసిన జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను!
Bobbili: బొబ్బిలి కోటలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను) మంగళవారం బొబ్బిలి కోటకు చేరుకుని ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె రంగారావు (బేబీనాయన)ను మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు - టీడీపీలో చేరిన తర్వాత తొలిసారి బొబ్బిలి కోటకు వచ్చారు. ఎమ్మెల్యే బేబీనాయనతో కలిసి దాదాపు గంట పాటు చర్చించారు.
ప్రధానంగా జిల్లా రాజకీయ పరిస్థితులు, టీడీపీ పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ - నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బొబ్బిలి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న శ్రీను టీడీపీలోకి రావడంతో - బొబ్బిలి నియోజకవర్గంలో - టీడీపీ మరింత బలపడినట్లు అయిందని - పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
జడ్పీ ఛైర్మన్ చేరికతో - రానున్న స్థానిక ఎన్నికల్లో - బొబ్బిలి కోటలో - టీడీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని - ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.




