Hanamkonda: పరకాలలో ఘనంగా 100 పడకల ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు ప్రారంభం!
Hanamkonda: హనుమకొండ జిల్లా పరకాలలో 100 పడకల ఏరియా ఆసుపత్రి ఓపీ సేవలు ప్రారంభం. ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్.
Hanamkonda: పరకాలలో ఘనంగా 100 పడకల ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు ప్రారంభం!
Hanamkonda:పరకాలలో 100 పడకల ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు ప్రారంభం. ప్రజలకు మెరుగైన వైద్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే రేవూరి
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
పరకాలలో నూతన 100 పడకల ఏరియా ఆసుపత్రి ఓపీ సేవలను కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. గణపతి పూజ అనంతరం ఫార్మసీ, జనరల్ వార్డు, గైనకాలజీ, ల్యాబ్ విభాగాలను ప్రారంభించి, స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
12 విభాగాల్లో 27 మంది వైద్యులతో సేవలు అందిస్తున్నామని, పెండింగ్ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, దామోదర సహకారంతో మంజూరు చేయించామని తెలిపారు. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఆసుపత్రిని A+ కేటగిరీకి తీసుకొస్తామని అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, ఆర్డీవో వెంకన్న, సూపరింటెండెంట్ డా.వంశీకృష్ణ పాల్గొన్నారు.




