Duggondi: గాలివానకు 17 ఎకరాల అరటి తోట ధ్వంసం.. రైతుకు భారీ నష్టం!

Duggondi: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో తీవ్ర విషాదం. ఈదురు గాలుల ధాటికి 17 ఎకరాల అరటి తోట నేలమట్టం.

G PRADEEP KUMAR, NARSAMPET
Published on: 13 Jun 2026 1:01 PM IST
Duggondi
X

Duggondi: గాలివానకు 17 ఎకరాల అరటి తోట ధ్వంసం.. రైతుకు భారీ నష్టం!

వరంగల్ జిల్లా: దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు లాడే యుగేందర్ సాగు చేసిన 17 ఎకరాల అరటి తోట నిన్న రాత్రి వీచిన బలమైన ఈదురు గాలులకు వర్షనికి తీవ్రంగా దెబ్బతింది. గాలుల ధాటికి పెద్ద సంఖ్యలో అరటి చెట్లు నేలకూలిపోవడంతో రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలిసింది.

పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ప్రకృతి విపత్తు సంభవించడంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంతో ఖర్చుతో సాగు చేసిన అరటి పంట ఒక్కసారిగా నేలమట్టం కావడంతో పెట్టుబడి తిరిగి వస్తుందో లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు.

నష్టపోయిన తోటను వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు తగిన పరిహారం అందించాలని రైతు లాడే యుగేందర్ కోరారు.

G PRADEEP KUMAR, NARSAMPET

G PRADEEP KUMAR, NARSAMPET

Next Story