Warangal: వరంగల్ ప్రజావాణిలో 198 అర్జీల స్వీకరణ: పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం

Warangal: వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద 198 అర్జీలను స్వీకరించి, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 2 Nov 2026 9:05 PM IST
Warangal
X

Warangal: వరంగల్ ప్రజావాణిలో 198 అర్జీల స్వీకరణ: పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం

వరంగల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.

సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 198 అర్జీలను స్వీకరించారు.

ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 69, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 32, ఉపాధి శాఖ 12,లీడ్ బ్యాంక్ 12 ,రాగా ఇతర శాఖలకు సంబంధించి మరో 73 అర్జీలు అందినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పేర్కొన్నారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.

ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్, లీడ్ బ్యాంక్ ,ఉపాధి శాఖలకు సంబంధించిన సమస్యలతో పాటు వృద్ధుల తమ సమస్యల పరిష్కారం కోసం అధిక సంఖ్యలో అర్జీలు సమర్పించారు. ప్రజావాణి సమస్యల పై వచ్చిన పిటిషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారుల ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, డియార్వో విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ వసంత, హౌసింగ్ పీడీ శ్రీవాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రాజిరెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విశ్వప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.