Warangal: కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో ఆర్డీఎఫ్, చెస్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో పోటీలు

Warangal: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో చెస్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఘనంగా చెస్ పోటీలు. 200 మందికి పైగా విద్యార్థుల భాగస్వామ్యం.

P ASHOK, WARDHANNAPET
Published on: 23 Aug 2026 12:06 PM IST
Warangal
X

Warangal: కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో ఆర్డీఎఫ్, చెస్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో పోటీలు

Warangal: కల్లెడ ఆర్డిఎఫ్ కళాశాలలో RDF రామ్మోహన్ రావు మరియు " చెస్ నెట్వర్క్" ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చెస్ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలోసుమారు 200 మంది పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

చెస్ ఆట కేవలం వినోదానికే పరిమితం కాకుండా ఆలోచనా శక్తిని, నిర్ణయ సామర్థ్యాన్ని, ఓర్పును పెంచే క్రీడగా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఎత్తును ముందుగానే అంచనా వేస్తూ ప్రత్యర్థి వ్యూహాన్ని ఎదుర్కోవడంలో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచేలా పోటీలు ఎంతో ఉత్కంఠభరితంగా, క్రమశిక్షణతో సాగాయి. విద్యార్థులు విజయం కోసం పోటీపడుతూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. విజేతలకు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందనలు తెలియజేసి బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా చెస్ నెట్వర్క్ ప్రెసిడెంట్ సంజయ్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, చదరంగాన్ని విద్యార్థులకు& యువతకు విస్తృతంగా పరిచయం చేసి చెస్ కల్చర్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా "చెస్‌ నెట్‌వర్క్‌"పనిచేస్తుంది అని

చెస్ నెట్వర్క్ ఇప్పటికీ 25 వేలకు పైగా ప్రొఫెషనల్ చెస్ సెట్స్ అంటే చెస్ బోర్డులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

చెస్ బోర్డులను పంపిణీ చేయడమే కాదు ట్రై నర్స్ ను తయారు చేయడం,టోర్నమెంట్లు నిర్వహించడం, చెస్ క్లబ్లను చెస్ అడ్డాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నదని.

Let's spread the joy of chess అనే నినాదంతో చలో దోస్త్ ఆడదాం అని విద్యార్థి లోకంలోకి దూసుకొనిపోతున్నది అని

విద్యార్థులలో చదువుతో పాటు క్రీడా ప్రతిభను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని . ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET

Next Story