Mulugu: జంగాలపల్లి గణపతి మండపం వద్ద మహా అన్నదానం
Mulugu: ములుగు మండలం జంగాలపల్లి గణపతి మండపం వద్ద నిర్వహించిన మహా అన్నదానంలో 400 మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
Mulugu: జంగాలపల్లి గణపతి మండపం వద్ద మహా అన్నదానం
ములుగు జిల్లా: ములుగు గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ములుగు మండలం జంగాలపల్లి క్రాస్‌రోడ్ గ్రామంలో గణపతి మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
నాగపురి సాయి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సుమారు 400 మందికి అన్నప్రసాదం అందించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్,ములుగు డీఎస్పీ రవీందర్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూనూరు అశోక్ గౌడ్, ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ముసినిపల్లి కుమార్ గౌడ్, జంగాలపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు కర్నే రతన్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.




