Jangaon: జనగామ పంక్చర్ షాప్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు!
Jangaon: జనగామ పంక్చర్ షాప్ యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. ప్రత్యేక డ్రెస్ కోడ్‌లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన సభ్యులు.
Jangaon: జనగామ పంక్చర్ షాప్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు!
Jangaon: జనగామ పంక్చర్ షాప్ యూనియన్ ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రోజున అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో యూనియన్ సభ్యులందరూ క్రమశిక్షణతో తమ నిర్దేశిత డ్రెస్ కోడ్‌ను ధరించి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి యూనియన్ గౌరవాధ్యక్షులు MD. యాకూబ్ పాషా అధ్యక్షులు నూనె రాములు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాను ఎగరేశారు అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యమత్యంగా ఉంటూ దేశభక్తిని చాటుకోవడం అభినందనీయమని కొనియాడారు యూనియన్ సభ్యుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ వేడుకల్లో సుమారు 60 మంది కమిటీ సభ్యులతో పాటు యూనియన్ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జాతీయ గీతాలాపన అనంతరం సభ్యులందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు.




