Gudur: గూడూరులో ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

B NARASIMHA, GUDUR
Published on: 15 Oct 2026 2:30 PM IST
Gudur
X

Gudur: గూడూరులో ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వాకింగ్ గ్రౌండ్‌లో భారతరత్న, మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆదర్శప్రాయమైన ఆయన జీవిత విశేషాలను, సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ "అబ్దుల్ కలాం అమర్ రహే" అంటూ నినాదాలు చేశారు.

వయోవృద్ధురాలు సరోజన కు అరుదైన సత్కారం

గ్రౌండ్‌లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తూ, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న వయోవృద్ధురాలు సరోజన కు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు శాలువా కప్పి, పూల బొకే అందించి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముక్తవరం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు మండల వెంకటేశ్వర్లు, కార్యదర్శి నూనావత్ వీరన్న, గౌరవ సలహాదారులు సంగేపు స్వామి, కన్నా వెంకటేశ్వర్లు, ఐలబోయిన వీరయ్య, బుర్రి కొమురయ్య, బట్టు సారయ్యలతో పాటు సభ్యులు దోని యాదగిరి, సయ్యద్ కరీం, మడిపెద్ది భాస్కర్, వడ్డోజు రాజలింగాచారి, మచ్చిక మొగిలి, మండల మల్లేష్, అమృ, బాలు, నాను, బుర్క సత్యం, ఈసం కృష్ణమూర్తి, వల్లపు శ్రీనివాస్, ఊట్ల రాజేష్, సంగెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రామేశ్వరంలో కలాం నివాసం వద్ద కేక్ కట్ చేసిన వాకర్స్

తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం యాత్రకు వెళ్లిన గూడూరు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, అక్కడ రామేశ్వరంలోని అబ్దుల్ కలాం నివాసం వద్ద ఆయన జయంతి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. కలాం ఇంట కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ముయ్యబోయిన వెంకన్న, ఉపాధ్యక్షులు ఊకె లక్ష్మయ్య, కోశాధికారి బత్తుల శ్రీనివాస్, కార్యదర్శి పెనుక ప్రభాకర్, నాయకులు బీరం వెంకట్ రెడ్డి, గజ్జి మల్లయ్య, బెజ్జం రమేష్, సంగేపు బాబు, బోడ ఎల్లయ్య, బత్తుల లక్ష్మణ్, దబ్బగట్ల రమేష్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR