Hanumakonda: కేయూలో రూ.8 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు డిమాండ్

Hanumakonda: మాజీ హాస్టల్ డైరెక్టర్ ఎల్పి రాజ్ కుమార్ ను ఉద్యోగం నుండి వెంటనే బర్త్ రఫ్ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్ చేశారు.

AJAY, HANMAKONDA
Published on: 19 Jun 2026 4:22 PM IST
Hanumakonda
X

Hanumakonda: కేయూలో రూ.8 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు డిమాండ్

హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ నిధుల్లో అవకతవకులకు పాల్పడిన మాజీ హాస్టల్ డైరెక్టర్ ఎల్పి రాజ్ కుమార్ ను ఉద్యోగం నుండి వెంటనే బర్త్ రఫ్ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత భవనంలో కేయూ ఏబీవీపీ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద యూనివర్సిటీ అయిన కాకతీయ విశ్వవిద్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు అడ్మిషన్లు పొంది,విద్యనభ్యసిస్తున్నారన్నారు. విద్యార్థులు ఎంతో కష్టపడి ఫీజు చెల్లించి హాస్టల్ వసతి పొందుతున్నారు.

కానీ కాకతీయ విశ్వవిద్యాలయం గణిత శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ ఎల్.పి రాజ్ కుమార్ హాస్టల్ డైరెక్టర్ గా పని చేసిన కాలంలో కేయూ నిబంధనలకు విరుద్ధంగా 12 నుంచి నుంచి 15 నెలల వరకు ఎలాంటి టెండర్ ప్రక్రియ నిర్వహించకుండా హాస్టల్ వ్యవస్థను కొనసాగించి దాదాపు 8 కోట్లకు పైగా పేద విద్యార్థుల సొమ్మును అక్రమంగా దోచుకోని యూనివర్సిటీ ప్రతిష్టను దిగదార్చిన ఎల్పీ రాజ్ కుమార్ తోపాటు ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న మిగతా బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగాల నుంచి తీసేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గత కొంత కాలంగా వి.సి కే ప్రతాపరెడ్డి ఉదాసీన వైఖరి కారణంగా కేయూ లో అనేక కోణాల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్న వైనం దర్శనమిస్తుందని ఇది ఇలాగే కొనసాగితే కాకతీయ యూనివర్సిటీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆయన ఆవేదన చెందారు.

కాకతీయ యూనివర్సిటీలో జరిగే పలు అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పరిపాలన భవనంలోని టీచింగ్, నాన్ టీచింగ్ అధికారులు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిని ప్రోత్సహిస్తూ బలం చేకురుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా వీ.సీ నిద్రమత్తు వీడి యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై ఏసీబీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ లతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోని వీ.సీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జూపల్లి దీపిక, కేయూ ఏబీవీపీ ఇంచార్జ్ డాక్టర్ నిమ్మల రాజేష్, క్రాంతి హరీష్, చంటి, అజయ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story