Hanamkonda: జిల్లావ్యాప్తంగా 70 గ్రామాల్లో పారదర్శకంగా భూముల రీసర్వే!
Hanamkonda: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి ధర్మసాగర్ ముప్పారం, వేలేరు షోడషపల్లి గ్రామాల్లో పారదర్శక భూముల రీసర్వే గ్రామసభల్లో పాల్గొని రైతులకు భరోసా ఇచ్చారు.
Hanamkonda: జిల్లావ్యాప్తంగా 70 గ్రామాల్లో పారదర్శకంగా భూముల రీసర్వే!
హనుమకొండ: జిల్లాలోని 70 గ్రామాల్లో చేపట్టిన భూముల రీ సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ముప్పారం, వేలేరు మండలం షోడశ పల్లి లో భూముల రీసర్వే పై భూములు కొలతల శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా భూములు కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లు భూముల రీసర్వే కి సంబంధించిన అంశాలపై గ్రామసభలో రైతులు, స్థానికులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా భూముల రీ సర్వే జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూముల రీ సర్వే చేపడుతుండగా సంబంధిత రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సర్వేయర్లకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముప్పారం గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక, ధర్మసాగర్ తహసిల్దార్ భావ్ సింగ్, పంచాయతీ కార్యదర్శి ఆకారపు సురేష్, షోడషపల్లి గ్రామ సర్పంచ్ రమాదేవి, వేలేరు తహసిల్దార్ కోమి, సర్వేయర్లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.




