Hanamkonda: వన మహోత్సవం, ఇందిరమ్మ ఇండ్లపై అదనపు కలెక్టర్ సమీక్ష!

Hanamkonda: వన మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 24 Jun 2026 9:17 PM IST
Hanamkonda
X

Hanamkonda: వన మహోత్సవం, ఇందిరమ్మ ఇండ్లపై అదనపు కలెక్టర్ సమీక్ష!

హనుమకొండ: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో వివిధ రకాల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.

బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు ఎంపీఓలతో వన మహోత్సవం, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పనులు, తదితర అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, ఉపాధి హామీ పనులు, టాయిలెట్ల నిర్మాణం, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో జడ్పీ సీఈవో శేషాద్రి, డి ఆర్ డి ఓ మేన శ్రీను, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ సైదుల్ రెడ్డి, అడిషనల్ డి ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులతో పాటు ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story