Mahabubabad: బయ్యారంలో వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం భారీ ర్యాలీ!

Mahabubabad: బయ్యారంలో ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. జీవో 3 స్థానంలో పటిష్ట చట్టాలు తెచ్చి హక్కులు కాపాడాలని ఆదివాసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 9 Aug 2026 4:50 PM IST
Mahabubabad
X

Mahabubabad: బయ్యారంలో వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం భారీ ర్యాలీ!

Mahabubabad: ఆదివాసుల హక్కులు, భవిష్యత్తు పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదివాసుల హక్కుల నాయకులు డిమాండ్ చేశారు.మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోనూ, కొత్తపేట గ్రామంలోనూ వివిధ ఆదివాసుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మహిళలతో నృత్యా ప్రదర్శన నిర్వహించారు, కొమరం భీం విగ్ర దగ్గర జెండా ఆవిష్కరణ చేసి, కొమరం భీం విగ్రహానికి మహిళా సర్పంచులు, ఆదివాసి నాయకులు పూలమాలవేసిన నివాళులర్పించారు.

ఆదివాసి నాయకుడు వెంకటకృష్ణ మాట్లాడుతూ.. జీవో _3 రద్దుతో మా ఆదివాసి యువతలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు, ఆదివాసి దినోత్సవo సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదివాసులకు జీవోను అమలు చేస్తానని ప్రకటించింది అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా జీవోను ప్రకటించాలని అన్నారు.

ఆదివాసీ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, అటవీ–భూమి–జల వనరుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆదివాసీ సమాజం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు.

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని,ఆదివాసీల ఐక్యత, హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ,ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story