Jangaon: అర్హులైన పేదలకు 50 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందించాలి!

Jangaon: జనగామ జిల్లాలో కరువు నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలకు రూ.800 వేతనం, 50 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది.

S MAHENDER, PALAKURTHI
Published on: 4 Nov 2026 1:37 PM IST
Jangaon
X

Jangaon: అర్హులైన పేదలకు 50 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందించాలి!

Jangaon: ఎల్ నినొ ప్రభావంతో తీవ్ర కరువు సంబంధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ప్రతినెల 50 కేజీల బియ్యం 14 రకాల నిత్యావసర వస్తువులు రేషన్ షాపు ద్వారా పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సింగార రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బుధవారం పాలకుర్తి మండలం లోని మంచుప్పుల గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలాధ్యక్షులు కాకర్ల బాబు అధ్యక్షత వహించగా రమేష్ పాల్గొని మాట్లాడుతూ కరువు నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని బిబిజి గ్రామ్ జి చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో 200 రోజులు పని దినాలు కల్పించి 800 రూపాయలు వేతనం ఇవ్వాలని అన్నారు.

జాబు కార్డ్ లోని పేదలందరికీ జాబ్ కార్డులు మంజూరు చేయాలని కోరారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి ₹12,000 ఇస్తామని హామీని అమలు చేయాలని, నిరుపేదలందరికీ గ్రామాలలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని. దేశవ్యాప్తంగా ఎల్ఇనో కరువు కమ్ముకుంటుందని తక్షణమే జనగామ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి. కూలీలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని,

సీనియర్ మేట్లను గుర్తించి వారికి కనీస వేతనం నిర్ణయించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచాలని. ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ (నవంబర్ 6న) హైదరాబాద్ కమిషనరేట్ ముందు జరిగే ధర్నా లో ఉపాధి కూలీలు సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కొత్తగా జాబ్ కార్డులు ఇవ్వడం లేదని. జాబ్ కార్డులో కొత్త పేర్లను చేర్చడం లేదని. ఆన్లైన్ మాస్టర్ ఉదయం సాయంత్రం పనిచేసే దగ్గర రెండుసార్లు ఫోటోల పేరుతో కూలీలను వేధిస్తున్నారని, ఆన్లైన్ మాస్టర్ వేయాలంటే 4జి లేదా 5g ఫోన్ ఉంటేనే సాధ్యమవుతుందని, నెట్వర్క్ లేని దగ్గర పనిచేసిన కూడా ఫోటోలు అప్లోడ్ కావడం లేదని ఫలితంగా కూలీలకు వేతనాలు ఇస్తారని గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిట్యాల సోమన్న, జిల్లా ఉపాధ్యక్షులు సోమసత్యం, జిల్లా కమిటీ సభ్యులు కాకర్ల పద్మ, కే (పెద్ద)బాబు, బి వెంకన్న, బి రేణుక, కే గౌతమి, వెన్నెల, మీ దయాకర్, డి సోమన్న, బి బిక్షం, పి యాదమ్మ, పి ఐలయ్య, మైసమ్మ, సోమలక్ష్మి, కే సతీష్ తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI