Hanumakonda: ఐనవోలులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Hanumakonda: హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీ భ్రమరాంబిక అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు శైలపుత్రి అలంకార దర్శనంతో ప్రారంభమయ్యాయి.

P ASHOK, WARDHANNAPET
Published on: 11 Oct 2026 2:23 PM IST
Hanumakonda
X

Hanumakonda: ఐనవోలులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

హనుమకొండ జిల్లా: ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణంలో గల శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. మొదటి రోజు అమ్మవారి శైల పుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఆదివారము ఉదయం సుప్రభాతసేవ, విఘ్నేశ్వరపూజ, శైవశుద్ధి పుణ్యాహవాచనము, పంచగవ్యప్రాశన, ఋత్విక్ వరుణ దీక్షాదారణ, అఖండదీపారాదన త్రిశూలపూజ, అంకురారోపణ, మంటపారాధన ప్రధాన కలశస్థాపన, అమ్మవారి నవ కలశన్నపన సుగంధపరిమళ ద్రవ్యాభిషేకం నవరాత్రి వ్రతారంభం. నిత్యాహ్నికం, మహానైవెద్యము, నీరాజన మంత్రపుష్ప, తీర్ధప్రసాదవితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.

కార్యక్రమాలలో దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్,ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, వేదపారాయణదారులు విక్రాంత్ జోషి,ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్,ఐనవోలు మధుకర్ శర్మ, అర్చకులు నందనం భాను ప్రసాద్, నరేష్ శర్మ, ఉప్పుల శ్రీనివాస్, దేవేందర్ సాయి వరుణ్, మణిశర్మ అర్చక, సిబ్బంది పాల్గొన్నారు మరియు దేవాలయ సిబ్బంది కిరణ్ కుమార్, టి. రాజు,లడ్డు రాజు, రఘు రాజు,భక్తులు రవితేజ, ప్రదీప్ మరియు ఉప్పల శ్రీనివాస్ అర్చక గార్లు అమ్మ వారి మాలధారణ చేయడం జరిగినది.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET