Mahabubabad: అక్రమ అరెస్టులతో గొంతు నొక్కలేరు.. అజ్మీరా రాము ఫైర్!

Mahabubabad: అక్రమ హౌస్ అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని మహబూబాబాద్ జిల్లా బీజేపీ నాయకుడు అజ్మీరా రాము కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 7 Sept 2026 2:38 PM IST
Mahabubabad
X

Mahabubabad: అక్రమ అరెస్టులతో గొంతు నొక్కలేరు.. అజ్మీరా రాము ఫైర్!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కేందుకు అక్రమ హౌస్ అరెస్టులకు పాల్పడటం అప్రజాస్వామిక చర్య అని బీజేపీ మహబూబాద్ జిల్లా నాయకులు అజ్మీరా రాము అన్నారు.

రాము మాట్లాడుతూ, 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ పైనే తిరగబడిన చరిత్ర మాది. బీజేపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం సిగ్గుచేటని అన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారు పిలుపు మేరకు చేపట్టిన “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు గార్ల ల్లో తన స్వగృహంలో తనను మరియు గార్ల లో నీ బిజెపి నాయకులని మరియు ఇల్లెందు నియోజకవర్గం లోని బిజెపి నాయకులను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి, అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలరాయలేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు.

రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును రేవంత్ రెడ్డి ఆపలేరు. పోలీసులతో అక్రమ నిర్బంధాలు చేయించొచ్చు.. కానీ ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాన్ని మాత్రం ఆపలేరు

అక్రమ అరెస్టులతో సమస్యలు పరిష్కారం కాదు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిందే అని కోరారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story