Hanamkonda: వరంగల్ జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆకుల శ్రీధర్!

Hanamkonda: ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పరకాలకు చెందిన ఆకుల శ్రీధర్ నియామక పత్రాన్ని అధ్యక్షుడు గాదె లింగమూర్తి అందించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 27 Oct 2026 2:06 PM IST
Hanamkonda
X

Hanamkonda: వరంగల్ జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆకుల శ్రీధర్!

Hanamkonda: ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆకుల శ్రీధర్ . ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాదె లింగమూర్తి చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగాల్లో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంక్షేమం, అభివృద్ధి, ఐక్యత కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ రంగంలో పనిచేస్తున్న వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేస్తూ, సభ్యులందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో జిల్లా స్థాయి ఉపాధ్యక్ష బాధ్యతలను అప్పగించిన జిల్లా అధ్యక్షుడు గాదె లింగమూర్తికి, అసోసియేషన్ నాయకులకు, సభ్యులకు ఆకుల శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పరకాల ప్రాంతానికి చెందిన ఆకుల శ్రీధర్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు లభించడంపై ఫోటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసోసియేషన్ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL