Palakurthi: దర్దేపల్లి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ!

Palakurthi: దర్దేపల్లి పాఠశాలల్లో 100 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, ప్లేట్లు పంపిణీ చేసిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్. డైరీ రాయాలని శ్రీకాంత్ పిలుపు.

S MAHENDER, PALAKURTHI
Published on: 16 July 2026 5:42 PM IST
Palakurthi
X

Palakurthi: దర్దేపల్లి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ!

Palakurthi: పాలకుర్తి మండలంలోని దర్దేపల్లి గ్రామంలోని ZPHS,MPPS పాఠశాలల్లో 100 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు,ప్లేట్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెండ్లి భాస్కర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్ మాట్లాడుతూ పాఠశాల దశ నుండే విద్యార్థులు రోజువారీ పనులను నిర్దేశించుకోవాలని,డైరీ రాయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

ట్రస్ట్ సభ్యులను ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు Dr. K.వెంకటేశం,దేవగిరి సూర్యప్రకాష్ అభినందించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి ఒర్రె కుమారస్వామి,పాఠశాల ఉపాధ్యాయులు సోమ మల్లయ్య,బలుగుల ఉప్పలయ్య,రవీందర్,పోగు వెంకట్,నర్సయ్య,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story