Mahabubabad: కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడీలు – హోరెత్తిన నినాదాలు!
Mahabubabad: కనీస వేతనం రూ.18,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు.
Mahabubabad: కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడీలు – హోరెత్తిన నినాదాలు!
Mahabubabad: తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి.
ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరి మాట్లాడుతూ... అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి , పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు రూ.18,000 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయడంతో పాటు, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు.
హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్ సారథి , కార్యదర్శి రేషపల్లి నవీన్, అంగన్వాడీ టీచర్లు , హెల్పర్లు పాల్గొన్నారు.




