Jangaon: మహిళా చైర్‌పర్సన్‌ను అవమానిస్తే సహించేది లేదు: కాంగ్రెస్ నేతల హెచ్చరిక!
Jangaon: జనగామ పురపాలక అభివృద్ధిని చూసి ఓర్వలేకే చైర్‌పర్సన్ కడమంచి బాలమణిపై బీఆర్‌ఎస్ కక్ష సాధింపు చర్యలు. కాంగ్రెస్ పార్టీ నాయకుల తీవ్ర ఆగ్రహం, విలేకరుల సమావేశం.
Jangaon: మహిళా చైర్‌పర్సన్‌ను అవమానిస్తే సహించేది లేదు: కాంగ్రెస్ నేతల హెచ్చరిక!
జనగామ జిల్లా: జనగామ పురపాలక అభివృద్ధి ని జీర్ణించుకోలేక బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కడమంచి బాలమణిపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జనగామ పట్టణంలో గతంలో ఎన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
తాగునీటి సరఫరా పారిశుధ్య పనులు రహదారుల నిర్మాణం వీధి దీపాల ఏర్పాటు వంటి అనేక పనులు మున్సిపల్ చైర్ పర్సన్ చొరవతో జరుగుతున్నారుఈ అభివృద్ధిని చూసి ఓర్వలేని బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు లేనిపోని ఆరోపణలు చేస్తూ మండలి సమావేశాల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు.
ఒక మహిళా చైర్ పర్సన్ ను అవమానించేలా మాట్లాడటం వారి సంస్కారానికి నిదర్శనమని అన్నారు ప్రజలంతా గమనిస్తున్నారని ఇలాంటి కక్షపూరిత రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు పురపాలక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని కడమంచి బాలమణి నాయకత్వంలో జనగామను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మేడ శీను వార్డ్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




