Narsampet: నర్సంపేట మహిళా జైలులో మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు!
Narsampet: నర్సంపేట జిల్లా మహిళా జైలులో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఖైదీలు, సిబ్బందితో జైలర్ స్రవంతి ప్రతిజ్ఞ చేయించారు.
Narsampet: నర్సంపేట మహిళా జైలులో మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు!
నర్సంపేట: పట్టణం లోని జిల్లా మహిళా జైలు లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం.
జైలర్ స్రవంతి మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి, కుటుంబం, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు.
అనంతరం ఖైదీలు, జైలు సిబ్బందితో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జైలు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




