jangaon: దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!

jangaon: సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి సందర్భంగా జనగామ పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 4 July 2026 12:48 PM IST
jangaon
X

jangaon: దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!

జనగామ: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి సందర్భంగా జనగామ పట్టణంలోని కళ్లెం కమాన్ వద్ద గల ఆయన విగ్రహానికి జనగామ పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు బాల్దే మల్లేశం కురుమ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మునిసిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతీ వై టి డి ఎ మెంబర్ లక్ష్మీనారాయణ నాయక్ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షులు సేవిల్లి సంపత్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కంచరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు కౌన్సిలర్ దేవర రాజు గౌరవ అధ్యక్షులు మోటే పర్వతాలు, పట్టణ కార్యదర్శి జూకంటి శ్రీశైలం పట్టణ కోశాధికారి కేమిడి ఉపేందర్ హాజరై దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ పోరాటానికి చేసిన సేవలను కొనియాడారు.

ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు దామెర మల్లికాంబ పెర్నె స్వరూప కోపా అధ్యక్షులు కడకంచి మధుసూదన్ కోపా కోశాధికారి ఎండ్రు వైకుంఠం యూత్ రాష్ట్ర నాయకులు ఆలేటి రాజు నాయకులు చౌదర్పల్లి శేఖర్ కర్రె శ్రీనివాస్, మోటే శ్రీనివాస్ మోటే లింగయ్య,పాశం శ్రీశైలం మంగ రామకృష్ణతో పాటు పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు...

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story