Wardhannapet: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అరూరి రమేష్ సమీక్ష
Wardhannapet: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు మరియు ఈ నెల 22న కేటీఆర్ సభ జనసమీకరణపై మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Wardhannapet: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అరూరి రమేష్ సమీక్ష
వర్ధన్నపేట: కల బాంకెట్ హాల్స్ నందు వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 1వ,2వ,3వ,14వ,43వ,44వ,45వ,46వ,55వ,56వ,64వ,65వ,66వ డివిజన్లు మరియు హాసన్ పర్తి రూరల్ మండల పరిధిలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియపై మరియు రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5 గంటలకు కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న సభకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరు కానున్న సందర్భంగా జన సమీకరణ కోసం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు.
ఈ కార్యక్రమంలో 13 డివిజన్ల మరియు హాసన్ పర్తి రూరల్ మండల పరిధిలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




