Mahabubabad: మహబూబాబాద్‌లో కలకలం: బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ!
Mahabubabad: మహబూబాబాద్ ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ. 22 మంది ఖాతాదారుల నగలతో పరారైన అసిస్టెంట్ మేనేజర్ రాజేష్; గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.
Mahabubabad: మహబూబాబాద్‌లో కలకలం: బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఇండియన్ బ్యాంకు లో బంగారు ఆభరణాల చోరీ కలకలం సృష్టించింది. బంగారు ఆభరణాలను బ్యాంక్ లో పెట్టి రుణాలు తీసుకున్న 22 మంది ఖాతాదారుల కు చెందిన 700 గ్రాముల బంగారు ఆభరణాలను బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ చోరీ చేసి తన సొంత అవసరాలకు వాడుకున్నాడు.
దీని విలువ సుమారు 90 లక్షల రూపాయలు ఉంటుంది. నెల లో జరిగే బ్యాంక్ మేనేజర్ తనిఖీల్లో ఈ చోరీ విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పట్టణ సీఐ రఘుపతి రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసిస్టెంట్ మేనేజర్ పరారీలో ఉన్నాడు.బ్యాంకు లో పూర్తిగా ఆడిట్ జరిగితే ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టని చందంగా మారింది.




