Atmakur: ఆత్మకూర్‌లో 91 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్!

Atmakur: ఆత్మకూర్ పరిధి గూడేపహాడ్ క్రాస్ రోడ్ వద్ద 91 కిలోల ఎండు గంజాయి పట్టివేత ముగ్గురు ఏపీ నిందితుల అరెస్ట్, రూ.45.66 లక్షల సరుకు సీజ్, పరకాల కోర్టులో హాజరు.

M PRABHAKAR, PARAKAL
Published on: 28 Sept 2026 6:27 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూర్‌లో 91 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్!

ఆత్మకూర్, సెప్టెంబర్ 28: ఆత్మకూర్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ బాబులాల్ తెలిపిన వివరాల ప్రకారం, ఎస్ఐ పి. తిరుపతి తన సిబ్బందితో శనివారం గూడేపహాడ్ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు.

పట్టుబడిన నిందితులు:

వెలుగూరి తాతారావు (28), తండ్రి రామారావు, జి.కె.వీధి, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏపీ. కిలో గోపాల్ రావు (29), తండ్రి నీరో, మోతుగూడెం, చింతూరు మండలం, ఏపీ. కిలో సతీబాబు (21), తండ్రి జగబంధు, మోతుగూడెం, చింతూరు మండలం, ఏపీ.

వారి వద్ద నుండి సుమారు 91 కిలోల ఎండు గంజాయి, దీని విలువ సుమారు రూ.45,66,000, అలాగే 2 స్మార్ట్ ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి NDPS చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆదివారం నిందితులను రిమాండ్ నిమిత్తం పరకాల కోర్టుకు తరలించారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL