Hanamkonda: వంగపహాడ్‌లో వీరన్న ఉత్సవాల గొడవ.. బీరు సీసాలు, కత్తులతో యువకుడిపై దాడి!
Hanamkonda: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లో వీరన్న ఉత్సవాల సందర్భంగా ఘర్షణ.
Hanamkonda: వంగపహాడ్‌లో వీరన్న ఉత్సవాల గొడవ.. బీరు సీసాలు, కత్తులతో యువకుడిపై దాడి!
Hanamkonda: బీరు సీసాలతో,కత్తితో దాడి చేసిన ఘటనలో యువకుడితోపాటు యువకుడు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హసన్పర్తి మండలం వంగపహాడ్ లో మూడు రోజులుగా వీరన్న ఉత్సవాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన ఋషికేషన్ పై అదే ప్రాంతానికి చెందిన ఓ పార్టీ యువకుడు రాకేష్ బీర్ సీసా, కత్తులతో దాడి చేశాడు. రాకేష్ తో పాటు మరికొంత మంది యువకులు ఘటనలో పాల్గొన్నట్లు తెలిసింది. అడ్డువచ్చిన రిషికేష్ తండ్రి కుమారస్వామి, మామ బిక్షపతి పై కూడా దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. యువకుడికి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన యువకుడు అతని స్నేహితులు గ్రామంలో ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలుస్తుంది.దాడి చేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.




