Bhupalpally: పట్టపగలే చైన్ స్నాచింగ్ యత్నం: తప్పిన ప్రమాదం!
Bhupalpally: భూపాలపల్లి లక్ష్మీనగర్‌లో పట్టపగలే చైన్ స్నాచింగ్ యత్నం. వాకింగ్‌కు వెళ్లిన మహిళ మెడలోని గొలుసు లాగేందుకు దుండగుల యత్నం. పోలీసుల దర్యాప్తు.
Bhupalpally: పట్టపగలే చైన్ స్నాచింగ్ యత్నం: తప్పిన ప్రమాదం!
Bhupalpally: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు లక్ష్మీనగర్‌లో పట్టపగలే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం సుమారు 5:44 గంటల సమయంలో మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన దంపతులను వెంబడించిన దుండగులు మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్ళే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
స్థానిక నివాసితులైన చింతకుంట్ల సాంబరెడ్డి, అహల్య దంపతులు వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు మహిళను వెంబడించి క్షణాల్లోనే గొలుసు లాక్కునే క్రమంలో అది అతని చేతిలో కాకుండా మహిళా మెడలోనే పడిపోయింది, ఈ క్రమం లో వీధి చివర బైక్‌పై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది.
లక్ష్మీనగర్‌లో గత ఏడాది ఇదే నెలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓ ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటనను స్థానిక 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి-సదానందం గౌడ్ గుర్తుచేశారు. వరుస ఘటనలతో కాలనీవాసులు, మహిళలు, వృద్ధుల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, . లక్ష్మీనగర్ పరిసరాల్లో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో బ్లూ కోల్ట్స్‌తో పాటు పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచి ప్రజలకు భద్రత కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరారు.




