Mahabubabad: మహబూబాబాద్‌లో ఆటో డ్రైవర్ల రాస్తారోకో, నిరసన!
Mahabubabad: మహబూబాబాద్‌లో ఆటో డ్రైవర్ల రాస్తారోకో.. మహాలక్ష్మి పథకంతో జీవనోపాధి కోల్పోయామంటూ ఆందోళన, వివిధ డిమాండ్ల సాధనకై నిరసన.
Mahabubabad: మహబూబాబాద్‌లో ఆటో డ్రైవర్ల రాస్తారోకో, నిరసన!
Mahabubabad: ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ముత్యాలమ్మ గుడి సెంటర్ లో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్లకార్డులతో ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సందర్భంగా ఆటో డ్రైవర్స్ జిల్లా గౌరవాధ్యక్షుడు యాళ్ళ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహిళల కు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు తో ఆటో డ్రైవర్లకు జీవనోపాధి పోయి వీధినపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ఆటో డ్రైవర్లకు 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని , 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను పునరుద్ధరించాలని,
తెలంగాణ లో ఓలా, ఉబర్, రాపిడో ను అధికారికంగా రద్దు చేయాలని,ప్రభుత్వం EV ఆటోలను ఆటో డ్రైవర్లకు అందించాలని , విధుల్లో మృతి చెందిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను అందించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల డిమాండ్లను పరిష్కరించని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మహబూబాబాద్ నుంచే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




