Hanamkonda: ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక ఫోకస్!
Hanamkonda: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ఎమ్మెల్యే కుమార్తె డాక్టర్ శ్రీగోదా విష్ణు రెడ్డి అవగాహన సమావేశం
Warangal: ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక ఫోకస్!
Hanamkonda: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని సమర్థవంతంగా, తప్పుల్లేకుండా పూర్తి చేయాలనే లక్ష్యంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి కుమార్తె డాక్టర్ శ్రీమతి శ్రీగోదా విష్ణు రెడ్డి గారు గురువారం బీఎల్ఏలకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 6, 49, 50, 52, 53, 54 డివిజన్ల పరిధిలోని బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై ఎన్యుమరేషన్ ఫారాలను సరైన విధంగా నింపడం, ఓటర్ల వివరాలను పొరపాట్లు లేకుండా నమోదు చేయడం, అవసరమైన సవరణలు చేయడం, 2002 ఓటరు జాబితాను ప్రస్తుత పోలింగ్ స్టేషన్ నంబర్లతో సరిపోల్చే విధానంపై సవివరంగా అవగాహన కల్పించారు.
అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచిస్తూ, ప్రతి అర్హత కలిగిన ఓటరికి సరైన మార్గదర్శకత్వం అందించి ఎలాంటి లోపాలకు తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని బీఎల్ఏలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత డివిజన్ ఇన్‌చార్జీలు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




