Hanumakonda: ఆత్మకూర్ నూతన సీఐగా బాబు లాల్ బాధ్యతల స్వీకరణ!
Hanumakonda: హనుమకొండ జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (సీఐ)గా 2009 బ్యాచ్ పోలీస్ అధికారి బాబు లాల్ బాధ్యతలు స్వీకరించారు.
Hanumakonda: ఆత్మకూర్ నూతన సీఐగా బాబు లాల్ బాధ్యతల స్వీకరణ!
Hanumakonda: ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్ ( స్టేషన్ హౌస్ ఆఫీసర్) బాబు లాల్ బుధవారం రోజునా బాధ్యతలు స్వీకరించారు.వారు 2009 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. గతంలో ఆయన గీసుకొండ, వరంగల్ ట్రాఫిక్ మరియు టాస్క్‌ఫోర్స్ విభాగాలలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి,సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు.
బదిలీపై వచ్చిన ఆయన ఈ రోజు ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా నూతన ఇన్‌స్పెక్టర్ బాబు లాల్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్టేషన్ పరిధిలోని ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించవచ్చని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
Next Story




