Jangaon: బానాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ పుష్కర వేడుకలు!

Jangaon: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో చినజీయర్ స్వామి వారి దివ్య సమక్షంలో తృతీయ పుష్కర వేడుకలు కల్యాణోత్సవం, పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

MD AHMAD PASHA, JANGAON
Published on: 23 July 2026 8:10 PM IST
Jangaon
X

Jangaon: బానాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ పుష్కర వేడుకలు!

జనగామ: జనగామ బానాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం తృతీయ పుష్కర మహోత్సవములలో భాగముగా 5 వ రోజు గురువారం ఉదయం చిన్న జీయర్ స్వామి వారి శ్రీహస్తముల మీదుగా వేలాదిమందికి తీర్థ గోష్టి జరిగింది. విశేషించి 250 మందికి పైగా దంపతులు వెంకటేశ హిస్టరీ హవనములో పాల్గొన్నారు 3000 మందికి పైగా శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవములో పాల్గొనగా పదివేల మందికి పైగా తదియారాధన చక్కగా నిర్వహించారు.

జీయర్ స్వామి వారి శ్రీ హస్తముల మీదుగా మహా కుంభ సంప్రోక్షణ అత్యంత వైభవముగా జరిగింది జీయర్ స్వామి వారు మాట్లాడుతూ సిద్ధాంతికి మనమంతా కృతజ్ఞతగా ఉండాలి అని వారు మంచి ఆయుష్య ఆరోగ్యంతో ఉండాలని స్వామివారి మంగళ శాసనం చేశారు వేలాది మంది భక్తుల నడుమ మహా పూర్ణహతి వైభవముగా జరిగింది శ్రీవారి తిరుప కల్యాణ మహోత్సవాన్ని జీయర్ స్వామి వారు వైభవముగా అత్యంత అద్భుతముగా నిర్వహించారు.

భగవత్ బంధువులందరికీ కూడా మంగళ శాసనాలు అందించారు మళ్లీ మళ్లీ ఇలాంటి ఉత్సవాలు జరగాలని అందరికీ మంగళాశాసనం చేశారు ఉత్సవాలలో పలువురు వేద విద్యార్థులు పాల్గొని అత్యంత వైభవముగా ఐదు రోజులు నిష్టగా పూజా కార్యక్రమాలు నిర్వహించినందుకు జీయర్ స్వామి వారందరికీ విశేష కైంకర్యాన్ని అందించి ఆశీర్వదించారు

భగవత్ బంధువులందరూ ఉత్సవంలో పాల్గొని జీయర్ స్వామివారి మంగళ శాసనములు వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది స్వామి వారి యొక్క తదియారాధన ప్రసాదాన్ని స్వీకరించి సంతోషాలతో తమ తమ ఇళ్లకు చేరారు

మళ్లీ మళ్లీ ఇలాంటి ఉత్సవాలు జరగాలని భక్తులంతా కొనియాడారు ఈ సందర్భంగా తృతీయ పుష్కర వేడుకల బ్రహ్మ శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి మాట్లాడుతూ ఈ వేడుకల విజయవంతంలో స్వామివారు ఆశీస్సులు భక్తుల తోడ్పాటు, ఏర్పాట్ల పర్యవేక్షణ నిర్వహణ లో చక్కగా అంకిత భావంతో పనిచేసిన వికాస తరంగిణి సభ్యులు, దేవాలయ భక్త బృందానికి శుభాశీస్సులు తెలిపారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story