Kesamudram: కేసముద్రంలో ఘనంగా తీజ్ పండుగ!
Kesamudram: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో బంజారా గిరిజన యువతులు అత్యంత భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Kesamudram: కేసముద్రంలో ఘనంగా తీజ్ పండుగ!
Kesamudram: బంజారా గిరిజన యువతులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే తీజ్ పండుగ మహోత్సవం కేసముద్రం మండల కేంద్రం ఘనంగా నిర్వహించారు. వివాహం కానీ గిరిజన యువతులు ఒక బుట్టలో గోధుమలు పెట్టి అవి మొలకెత్తు వరకు పది రోజులపాటు వాటిని ప్రత్యేకంగా అలంకరించిన పందిరి మంచం పై ఉంచి ప్రతిరోజు వాటికి నీరు పోస్తూ భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
చివరి రోజున వాటిని తీసుకొని గ్రామ చెరువుకుంటల్లో నిమజ్జనం చేస్తారు ఇది ఎన్నో ఏళ్లుగా గిరిజన సంప్రదాయంలో కొనసాగుతుంది వలన గిరిజన యువతులకు జరుగుతుందని మంచి వరుడు దొరుకుతారని నమ్ముతారు తీసి ఉత్సవాన్ని ప్రతి గిరిజన తండాలో నిర్వహిస్తారు. పాడిపంటలు పండాలని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని నమ్మకంతో కొలుస్తారు.
Next Story




