Mahabubabad: బ్యాంకుల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ 27న బ్యాంకు శాఖలు పనిచేస్తాయి !

Mahabubabad: సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకుల సమ్మె నేపథ్యంలో మహబూబాబాద్‌లో సెప్టెంబర్ 27 ఆదివారం రోజున అన్ని బ్యాంకు శాఖలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 26 Sept 2026 7:38 PM IST
Mahabubabad
X

Mahabubabad: బ్యాంకుల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ 27న బ్యాంకు శాఖలు పనిచేస్తాయి !

Mahabubabad: సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకుల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ 27, ఆదివారం అన్ని శాఖలు పనిచేస్తాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. ఖాతాదారులు తమ అత్యవసర బ్యాంకింగ్ పనులను సెప్టెంబర్ 27వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా 24×7 డిజిటల్ బ్యాంకింగ్ సేవలైన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ (యూనియన్ ఈజ్), యూపీఐ, ఏటీఎంలు, బీసీ, బ్యాంక్ మిత్ర పాయింట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకోవాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL