Mahabubabad: బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగ: ప్రొ. కోదండరాం

Mahabubabad: బతుకమ్మ తెలంగాణకే ప్రత్యేకమైన విశిష్ట పండుగ అని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మహబూబాబాద్‌లో జానపద కళాకారుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 16 Oct 2026 11:37 PM IST
Mahabubabad
X

Mahabubabad: బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగ: ప్రొ. కోదండరాం

మహబూబాబాద్ జిల్లా: బతుకమ్మ అనేది తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ అని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్.కోదండరాం అన్నారు.తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం తో మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో తెలంగాణ జానపద కళాకారులు కోలాటాలు వేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం బతుకమ్మ విగ్రహం వద్ద బతుకమ్మ సంప్రదాయ పాటలకు కోలాటాలు వేస్తూ , నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.....

పూలను పూజించడం ప్రపంచం లో ఎక్కడా లేదని , మహిళలు ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పడమే ప్రత్యేకత అని , బతుకమ్మ పండుగ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని కోరారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad