Mahabubabad: బయ్యారం సహకార సంఘం అధ్యక్షుడి తొలగింపుపై నిరసన!

Mahabubabad: బయ్యారం సహకార సంఘం అధ్యక్షుడి తొలగింపును నిరసిస్తూ కలెక్టరేట్‌లోని జిల్లా సహకార శాఖ కార్యాలయం ఎదుట డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు ధర్నా నిర్వహించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 6 Aug 2026 11:35 PM IST
Mahabubabad
X

Mahabubabad: బయ్యారం సహకార సంఘం అధ్యక్షుడి తొలగింపుపై నిరసన!

మహబూబాబాద్: సహకార సంఘం నిబంధనలకు విరుద్ధంగా బయ్యారం సహకార సంఘం అధ్యక్షుడిని తొలగించడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ లోని సహకార సంఘం కార్యాలయం ఛాంబర్ ఎదుట, సహకార సంఘం డైరెక్టర్లు , సర్పంచులు , ఉప సర్పంచ్ లు బైఠాయించి ధర్నా చేపట్టారు.

పోలీసులు , సొసైటీ డైరెక్టర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా సహకార సంఘం అధికారిని విజయ కుమారిని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం న్యాయం చేయాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తొలగించబడిన బయ్యారం సహకార సంఘం చైర్మన్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ.....నాకు వ్యవసాయ భూమి ఉందని , 2004 సంవత్సరం లో సభ్యత్వం ఇచ్చారని.

జిల్లా సహకార సంఘం అధికారిని విచారణ చేయకుండా పదవి లో నుంచి నన్ను తొలగించిందని , మా వర్గానికి 7 రు మెజారిటీ ఉన్నా అధ్యక్షుడిని చేయకుండా , 3 రు మెజార్టీ ఉన్న వారిని అధ్యక్షుడి గా చేశారని , నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ , అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా సహకార సంఘం అధికారిని ని సస్పెండ్ చేసి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story