Bayyaram: సహకార సంఘంలో ఘనంగా సహకార వారోత్సవాలు

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించి, జెండా ఆవిష్కరించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 14 Nov 2026 8:12 PM IST
Bayyaram
X

Bayyaram: సహకార సంఘంలో ఘనంగా సహకార వారోత్సవాలు

బయ్యారం: మహబూబాబాద్ జిల్లా మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ బండారి మల్లయ్య సహకార జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ...రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ రంగం బలోపేతంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.

రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ రుణాలు మరియు ఇతర సేవలను అందిస్తూ సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే సహకార వ్యవస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, రైతుల అభ్యున్నతే సహకార సంఘాల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్ కసనబోయిన శ్రీనివాస్ ,కార్యదర్శి రేగళ్ల సురేందర్ గారు, స్టాప్ అసిస్టెంట్ తుడుం రాజేష్, గట్ల అనూష, రేగళ్ల గణేష్, సిబ్బంది ఉప్పరపల్లి వెంకటేష్, మాలోత్ సురేష్, నీలారపు సతీష్, సంగీత స్థానిక రైతులు గుర్రం పూర్ణ, ధనుంజయ్యా, హమాలీ తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM