Bayyaram: బయ్యారం ఆదివాసి సంక్షేమ పరిషత్ నూతన కమిటీ ఎన్నిక

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక; మండల అధ్యక్షుడిగా ఈసం రాధాకృష్ణ ఎంపిక.

NARASIMHARAO, BAYYARAM
Published on: 22 Nov 2026 8:48 PM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారం ఆదివాసి సంక్షేమ పరిషత్ నూతన కమిటీ ఎన్నిక

బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కోదండరాం ఫంక్షన్ హాల్‌ లో ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ బయ్యారం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది,

నూతనంగా ఎన్నికైన మండల కమిటీ వివరాలు .మండల అధ్యక్షులు: ఈసం రాధాకృష్ణ – కోయగూడెం,మండల ఉపాధ్యక్షులు: పూనెం మంగయ్య – కొత్తగూడెం,మండల ఉపాధ్యక్షులు: వట్టం శ్రీను – కొత్తపేట,మండల ప్రధాన కార్యదర్శి: ముక్తి చిరంజీవి – రెండార్లగడ్డ,అదనపు కార్యదర్శి: చాట్ల ప్రశాంత్ – బయ్యారం, అదనపు కార్యదర్శి: పొడుగు రవికృష్ణ – లక్ష్మీపురం

, కార్యదర్శి: పూనెం లింగరాజు – మూల పోచారం,కార్యదర్శి: గుంట సురేష్ – కోయగూడెం

9కార్యదర్శి: అరెం కిషెందర్ – కొత్తగూడెం

ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షులు ఈసం రాధాకృష్ణ మాట్లాడుతూ ...తనపై నమ్మకంతో ఆదివాసి సంక్షేమ పరిషత్ బయ్యారం మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆశయాలను మండలంలోని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి, ఆదివాసీ యువతను సంఘటితం చేస్తూ, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల ఉల్లంఘనలపై నిరంతరం పోరాటం చేస్తానని. నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పరిషత్ నిర్ణయాలకు కట్టుబడి ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ముందుకు సాగుతానని తెలియజేశాడు .

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మంకిడి సురేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు ఇరప రాజేష్, జిల్లా కార్యదర్శి వరుస ప్రకాష్, మహబూబాబాద్ డివిజన్ తాటి ప్రవీణ్, మెస్సు రాజశేఖర్, ఇరప రామారావు, కొట్టెం పుల్లయ్య , చాట్ల సంపత్ , పులసమ్ రమేష్, వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసీ యువత పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM