Bayyaram: గీత కార్మికుల పింఛన్ కోసం సర్టిఫికెట్లు ఇవ్వాలి

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో సర్వాయి పాపన్న జయంతి. 50 ఏళ్లు పైబడిన గీత కార్మికుల పింఛన్ సర్టిఫికెట్ల కోసం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం.

NARASIMHARAO, BAYYARAM
Published on: 18 Aug 2026 5:01 PM IST
Bayyaram
X

Bayyaram: గీత కార్మికుల పింఛన్ కోసం సర్టిఫికెట్లు ఇవ్వాలి

బయ్యారం: గౌడ కులస్తులకు గీత కార్మిక పించన్ కోసం దృవీకరణ పత్రం జారీ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, గౌడ సంఘ నాయకులు సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

మహబూబాబాద్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ ఎక్సైజ్ అధికారికి గీత కార్మికులు ఈరోజు కలిసి, అధికారితో మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కుల వృత్తి దారులకు 50,, సం,,లు పై బడిన వారికి చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా ఉత్తర్వులు జారి చేసి ఉన్నారు. కాని ఆ ఉత్తర్వులలో గౌడ కుల వృత్తి దారులకు తమరి నుండి జారి చేసిన దృవీకరణ పత్రం జత చేయవలసిందిగా కోరారు.

కావున తమరు దయతో బయ్యారం గీత కార్మిక, పారిశ్రామిక, సహకార సంఘ సభ్యులకు దృవీకరణ పత్రాలు మంజూరు చేయవలసిందిగా వినతి పత్రం అందజేసినారు. ఈ కార్యక్రమంలో గీత కార్మికులు, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు...

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story