Bayyaram: బయ్యారంలో 51 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Bayyaram: బయ్యారం రైతు వేదికలో 51 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. పేదింటి ఆడబిడ్డలకు ప్రజా ప్రభుత్వం అండ.

NARASIMHARAO, BAYYARAM
Published on: 5 Nov 2026 5:34 PM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారంలో 51 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడుతూ...అర్హులైన 51లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.

పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం ఎంతోమంది కుటుంబాలకు అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బయ్యారం మండల తహసీల్దార్ , ఎంపీడీవో , వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM