Mahabubabad: బయ్యారం సింగిల్ విండో చైర్మన్ బండారి మల్లయ్యకు ఘన సన్మానం!

Mahabubabad: సింగిల్ విండో (PACS) నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బండారి మల్లయ్యను ఆదివాసీ, యాదవ సంఘాలు, గౌరారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 9 Aug 2026 10:36 PM IST
Mahabubabad
X

Mahabubabad: బయ్యారం సింగిల్ విండో చైర్మన్ బండారి మల్లయ్యకు ఘన సన్మానం!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని బయ్యారం సింగిల్ విండో నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బండారి మల్లయ్య ఆదివాసీ సర్పంచులు, ఆదివాసీ సంఘాల నాయకులు, యాదవ సంఘం, గౌరారం గ్రామ పాలకవర్గం, గౌరారం కాంగ్రెస్ గ్రామ కమిటీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆదివాసీ సర్పంచులు, సంఘాల నాయకులు చైర్మన్ బండారి మల్లయ్యను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. అనంతరం ఆదివాసీలకు సింగిల్ విండో సంఘంలో సభ్యత్వాలు మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చైర్మన్, రైతులు , ఆదివాసీలకు సహకార సంఘం ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అదేవిధంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ బండారి మల్లయ్య ఘనంగా సన్మానించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికి సింగిల్ విండో చైర్మన్ పదవి దక్కడం పట్ల యాదవ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సామాన్య వర్గాలకు చెందిన నాయకులకు అవకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. గౌరారం గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో కూడా చైర్మన్ బండారి మల్లయ్య ఘన సన్మానం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం చైర్మన్‌గా మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

గౌరారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్‌ను ఘనంగా సన్మానించి, స్వీట్లు తినిపించుకొని నాయకులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారందరూ మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బడుగు బలహీన వర్గాల నాయకుడికి చైర్మన్ పదవి దక్కడం కొంతమందికి జీర్ణించుకోవడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పదవులు అందరికీ సమానంగా దక్కాల్సిన అవసరం ఉందని, సామాజిక న్యాయం ప్రకారం వచ్చిన అవకాశాలను స్వాగతించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

చైర్మన్ పదవి కోల్పోయిన మాజీ చైర్మన్, బండారి మల్లయ్య నాయకత్వాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడం సరికాదని, పదవి ఎవరి సొత్తు కాదని నాయకులు పేర్కొన్నారు. రైతులు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడమే సహకార సంఘం ప్రధాన లక్ష్యమని, వ్యక్తిగత కక్షలకు సహకార సంఘాన్ని వేదికగా మార్చవద్దని హితవు పలికారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story