Bayyaram: బయ్యారంలో పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం సైకిల్ ర్యాలీ

Bayyaram: బయ్యారంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిఐ రవీందర్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 30 Oct 2026 4:27 PM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారంలో పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం సైకిల్ ర్యాలీ

బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఈరోజు CI రవీందర్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ...

1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దేశ సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తున్న భారత పోలీసు బృందంపై చైనా సైనికులు జరిపిన దాడిలో 10 మంది పోలీసు సిబ్బంది వీరమరణం పొందారు. విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఆ అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు.

అమర పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులు అర్పించడంతో పాటు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, ప్రజల ప్రాణాలు ,ఆస్తుల రక్షణ కోసం పోలీసులు చేస్తున్న నిరంతర కృషిపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు, యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత , శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.

దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. వారి సేవలు, స్ఫూర్తి భావితరాలకు ఎల్లప్పుడూ ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో బయ్యారం యస్. ఐ. ప్రశాంత్ బాబు, గార్ల యస్. ఐ. సాయి కుమార్,పోలీస్ సిబ్బంది ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM