Bayyaram: బయ్యారం పెద్ద చెరువు ఉగ్రరూపం.. అలుగు వద్ద పోలీస్ ఆంక్షలు!
Bayyaram: భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు నిండి అలుగు పోస్తుండటంతో ప్రమాదాల నివారణకు పోలీసులు బారికేడ్లు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Bayyaram: బయ్యారం పెద్ద చెరువు ఉగ్రరూపం.. అలుగు వద్ద పోలీస్ ఆంక్షలు!
మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండలంలోని గత రెండు రోజులు ఉండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మసివాగు, పందిపంపుల వాగు వరద నీరు భారీగా బయ్యారం చెరువులో చేరగా 16.6 నీటిమట్టం చేరగా చెరువు అలుగు పోస్తుంది, అలుగు ఈ దృశ్యాలు చూడటానికి ప్రేక్షకులు వస్తున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై ప్రశాంత్ బాబు ముందస్తుగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి, వాహనాలు రాకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశామని, చెరువు మత్తడి చూసేందుకు ప్రేక్షకులు సెల్ఫీలు, ఈతకు వెళ్లి ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకని ఎవరు రావద్దని, ప్రతిరోజు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.




