Jangaon: బీసీలకు కుల గణన రాజ్యాంగబద్ధ హక్కు: టి. చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్!
Jangaon: జనగామలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం జిల్లా సమావేశం జరిగింది. బీసీ కుల గణనకు రాజ్యాంగబద్ధ గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు డిమాండ్ చేశారు.
Jangaon: బీసీలకు కుల గణన రాజ్యాంగబద్ధ హక్కు: టి. చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్!
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని కెమిస్ట్ భవన్‌లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గడ్డం అనిల్ కుమార్ గౌడ్, అడ్వకేట్ గారు అధ్యక్షత వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు శ్రీ టి. చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ గారు పాల్గొని మాట్లాడుతూ బీసీలకు కుల గణన రాజ్యాంగబద్ధ హక్కుగా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీసీలు మెజారిటీగా ఉన్నా ఏ విధమైన లాభం, ప్రాధాన్యత లేకుండా పోయిందని, బీసీల ఓట్లతో అగ్రకులాల వారు గెలిచి అధికారంలోకి వస్తున్నారని, బీసీలను అలాగే అణగదొక్కాలని ప్లాన్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలలో ఎప్పుడైనా మేల్కోవాలని, బీసీలలో చాలా కులాలు ఉన్నా మనమందరం బీసీలుగా ఒకటి కావాలని, ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలకు ఏ లాభం చేయలేదని, మన ఓట్లు మనం కలిసి ఉండి మన వాళ్లను నిలబెట్టి గెలిపించుకుంటేనే లాభం జరుగుతుందని, విద్యలో కూడా మన పిల్లలు వెనుకబడి ఉన్నారని అన్నారు.
తెలంగాణ బీసీ కమిషన్ సభ్యురాలు శ్రీమతి బాలలక్ష్మి గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో బీసీల సర్వే చేశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేయడం చాలా మంచిదని, ఇందులో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు బ్లూ ప్రింట్ ఇండియా అధ్యక్షులు పి. ప్రసాద్ గౌడ్, పాలకురి అశోక్ గౌడ్,
జమాల్ షరీఫ్ అడ్వకేట్ & ప్రెసిడెంట్ ముస్లిం డెవలప్మెంట్ కమిటీ జనగామ జిల్లా గారు మాట్లాడుతూ బీసీలు మైనారిటీలు కలిసి ఉంటే వారి ఓట్లు చాలా ఉన్నా వారికి ఎలాంటి లాభం జరగడం లేదని మనమందరం కలిసి పని చేయాలని, మరియు మన కమ్యూనిటీలో అవగాహన తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో అభి గౌడ్ రంగు రాజశేఖర్ సాదిక్ అలీ అడ్వకేట్ ఆకుల శ్రీకాంత్ ప్రభాకర్ కంకరాజు తదితరులు పాల్గొన్నారు.




