Mahabubabad: స్వతంత్ర పోరాట స్ఫూర్తిప్రదాత బంకించంద్ర చటర్జీ!

Mahabubabad: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జాతీయ గేయ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ 188వ జయంతి వేడుకలను ఉపాధ్యాయులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు.

A.Rajkumar, Mahabubabad
Updated on: 28 Jun 2026 4:18 PM IST
Mahabubabad
X

Mahabubabad: స్వతంత్ర పోరాట స్ఫూర్తిప్రదాత బంకించంద్ర చటర్జీ!

మహబూబాబాద్: భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రదాత బంకిం చంద్రచటర్జీ అని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు అన్నారు. బంకించంద్ర చటర్జీ 188వ జయంతి వేడుకలు స్థానిక శ్రీరాం నగర్ బిసి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాచర్ల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో శంతన్ రామరాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి వందేమాతరం దేశభక్తి గేయాన్ని అందించిన గొప్ప కవి బంకించంద్రచటర్జీ అని పేర్కొన్నారు.

కవిగానే కాకుండా వ్యాసరచయితగా, సంపాదకుడిగా స్వాతంత్ర్య సమరయోధుడిగా తనదైన ముద్రవేసిన బంకిం చంద్రచటర్జీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. 1838 జూన్ 27న పశ్చిమ బెంగల్లో జన్మించిన బంకిం చంద్రచటర్జీ తన రచనలతో స్వాతంత్ర్య పోరాట సంగ్రామానిక ఊపిరిలూదాడన్నారు.

ఆయన రాసిన వందేమాతర గీతం నాటినుండి నేటివరకు భారతదేశ యువతకు నరనరాణ జాతీయవాదాన్ని నింపిందన్నారు. 1894 ఏప్రిల్ 8న. తన 55ఏళ్ల వయస్సులో మరణించిన బంకిం చంద్రచటర్జీ సూర్యచంద్రులున్నంత వరకూ భారతీయుల హృదయాల్లో విరాజిల్లుతూనే ఉంటాడని అన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల సిబ్బంది రాజేశ్వరి, అర్చనతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story